కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పార్టీని బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి బలం చేకూరగా తెలంగాణలో సైతం జనసేన (Janasena) పార్టీని బలోపేతం చేసేందుకు కీలక అడుగు వేశారు. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో(Telangana Municipal Elections) పోటీ చేస్తున్నట్లు జనసేన ప్రకటించింది. సాధ్యమైనన్ని స్థానాలలో తమ అభ్యర్ధులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళలు ప్రచారానికి సిద్దం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొనింది.
Read Also: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
Follow Us On : WhatsApp


