తెలంగాణలో జనసేన బలోపేతమే ప్రధాన అజెండా : తాళ్లూరి రామ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా బలోపేతం చేయడమే తమ ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్‌చార్జ్ మేడ రామకృష్ణ నేతృత్వంలో మహబూబ్‌నగర్ (Mahabubnagar ) జిల్లా, భూత్‌పూర్ రోడ్డులోని ఎస్.ఎన్. కన్వెన్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ… పాలమూరు జిల్లాలో జనసేన జెండాను రెపరెపలాడిస్తూ, పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో మేడ రామకృష్ణ వహిస్తున్న నాయకత్వ పాత్ర అత్యంత శ్లాఘనీయమని కొనియాడారు. రాత్రింబవళ్లు శ్రమిస్తూ కార్యకర్తలకు కొండంత అండగా నిలుస్తున్న రామకృష్ణ జిల్లా పార్టీకి నిజమైన వెన్నుముక అని ప్రశంసించారు. 2014 పార్టీ ఆవిర్భావం నుండి సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ నేలపై జనసేన గొంతుక నిరంతరం బలంగా వినిపించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ… యువత బలంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పాలమూరు నడిబొడ్డున ఉన్న అమరవీరుల స్థూపం నుండి సమావేశ ప్రాంగణం వరకు జనసైనికులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నేతలు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం వేదికగా మేడ రామకృష్ణ దిశానిర్దేశంలో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడు జిల్లా జనార్ధన్ రెడ్డి సుమారు 250 మంది అనుచరులు, మద్దతుదారులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో దుంపటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ఎం. దామోదర్ రెడ్డి, మేకల సతీష్ రెడ్డి, ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, డాక్టర్ గడల శ్రీనివాస్, అల్లాడి తనీష్, చిరాగ్ ప్రజీత్ గౌడ్, మచ్చా సుధాకర్, తనుజా రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, ప్రేమ్ గాంధీ, సంతోష్ నాయక్, పాటు పెద్ద ఎత్తున జిల్లా నాయకులు, మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>