రిటైర్డ్ పోలీసుల సేవలు స్ఫూర్తిదాయకం: ఎస్పీ

కలం, జగిత్యాల: పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన అధికారులను జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ (Jagtial SP Ashok) ఘనంగా సన్మానించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్‌ఐలు బి. ఆనందం, ఎమ్. శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ జి. రవిలకు ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలు అందజేసి (Police Felicitation) అభినందించారు. అనంతరం వారిని పోలీసు వాహనంలో ఎక్కించి పోలీస్ బ్యాండ్ తో వీడ్కోలు పలికారు.

రిటైర్మెంట్ అనేది సేవలకు ముగింపు కాదని, జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది అని ఎస్పీ అన్నారు. ప్రజల భద్రత కోసం అహర్నిశలు శ్రమించిన వారి సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, ఆరిఫ్ అలీ ఖాన్, ఎస్ఐ శ్రీకాంత్‌తోపాటు సిబ్బంది, రిటైర్డ్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Also Read : ఫైనల్‌‌కు ప్రీతి పవార్.. భారత్‌కు పతకం ఖాయం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>