రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: ఎమ్మెల్యే కుంభం

కలం, వలిగొండ: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధర పొందేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం వలిగొండ (Valigonda) మండలంలోని పొద్దుటూరు, ఎదులగూడెం, మాందాపురం, వలిగొండ గ్రామాల్లో దాన్యం కొనుగోలు కేంద్రాలను (Paddy Procurement Centres) ఎమ్మెల్యే కుంభం ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెలే (MLA Kumbham Anil Kumar Reddy) మాట్లాడుతూ.. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>