కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2027లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా రోహిత్ శర్మ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా నుంచి కెప్టెన్సీని తీసుకుని, ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన రోహిత్‌కే మళ్లీ పగ్గాలు అప్పగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం వెల్లడించింది. రోహిత్ కూడా ఇందుకు అంగీకరించినట్లు పేర్కొంది. అయితే ముంబై నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. హార్దిక్ నాయకత్వంలో ముంబై గత సీజన్లో 14 మ్యాచ్‌లకు పది ఓటములు ఎదుర్కొని తొమ్మిదో స్థానంలో నిలిచింది. దీంతో జట్టు నాయకత్వంపై యాజమాన్యం పునరాలోచన చేసినట్లు సమాచారం.
సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా పరిశీలించినా.. చివరకు రోహిత్ (Rohit Sharma) అనుభవానికే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్దిక్ ట్రేడ్ వ్యవహారం ఇంకా తేలలేదు. అతడిని మరో జట్టుకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ట్రేడ్ కుదరకపోతే ముంబైలోనే కొనసాగి, రోహిత్ కెప్టెన్సీలో ఆడేందుకు హార్దిక్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముంబై కోచింగ్ బృందంలోనూ మార్పులు చేసింది. కీరన్ పొలార్డ్ ప్రధాన కోచ్‌గా, రాబిన్ ఉతప్ప బ్యాటింగ్ కోచ్‌గా, మిచెల్ మెక్క్లెనగన్ బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్‌గా, ధవళ్ కులకర్ణి డెవలప్మెంట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

