Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్​కు జీవన్ రెడ్డి రాజీనామా..?

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న జీవన్ రెడ్డి (Jeevan Reddy) ప్రస్తుతం పార్టీ మారబోతున్నారనే వార్త రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆయన ఈ నెల 25న పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ జగిత్యాల గ్రూప్ టీమ్ TJRగా మార్పు చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి తన రాజీనామాపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు వినికిడి. ఆ తర్వాతే రాజీనామాపై అధికారిక ప్రకటన రావొచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి.

కాగా, జగిత్యాల రాజకీయాల్లోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన నేత జీవన్ రెడ్డి. సుమారు 42 ఏళ్లుగా ఆయన కాంగ్రెస్ జెండాను మోస్తూ, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అయితే గెలుపు – ఓటములతో సంబంధం లేకుండా ఏళ్ల తరబడి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనను కాదని, బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు (MLA Sanjay Kumar) కాంగ్రెస్ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. గత మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కూడా జీవన్ రెడ్డి సూచనలను అధిష్టానం పట్టించుకోలేదని సమాచారం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తనకు అవకాశం వస్తుందని ఆశించినా, అధిష్టానం వేరే నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని జీవన్ రెడ్డి (Jeevan Reddy) భావిస్తున్నారట. దీంతో రాజీనామాకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే జీవన్ రెడ్డి త్వరలో బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ మేరకు జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనా జీవన్ రెడ్డి లాంటి పెద్ద లీడర్ పార్టీ మార్పు అనే అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. నిజంగా ఆయన రాజీనామా చేస్తారా? బీఆర్ఎస్ గూటికి చేరతారా? లేదా వేరే నిర్ణయం తీసుకుంటారా? అనే విషయంపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.

Read Also: గ్యాస్ బుకింగ్.. ఔటాఫ్ కవరేజ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>