ముగిసిన మాజీ డీజీపీ హెచ్‌జే దొర అంత్యక్రియలు

కలం, వెబ్ డెస్క్: మాజీ డీజీపీ హెచ్‌జే దొర (HJ Dora) అంత్యక్రియలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి. అంతిమయాత్రలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ (CP Sajjanar) పాల్గొని పాడే మోశారు. ప్రభుత్వ లాంఛనాల మధ్య ఆయన అంత్యక్రియలు జరిపారు. హెచ్ జే దొర ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన ఉమ్మడి ఏపీలో ఎన్నో కీలకమైన హోదాల్లో ఆయన పనిచేశారు. ఉమ్మడి ఏపీ డీజీపీగా ఆయన సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు.

హెచ్‌జే దొర (HJ Dora ) హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ మరణించారు. 1965 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన దోర 1996 నుంచి 2002 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్‌గా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా కూడా సేవలు అందించారు.  మావోయిస్టులపై అత్యంత కఠినంగా వ్యవహరించారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>