కలం, వెబ్ డెస్క్ : జర్నలిస్టుల అరెస్ట్ ఘటనపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) స్పందించారు. అర్థరాత్రి అరెస్ట్ చేయడం సరికాదని, ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉందన్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి, పార్టీకి మంచిది కాదని తెలుపుతూ జగ్గారెడ్డి ఎక్స్ లో వీడియో విడుదల చేశారు. జర్నలిస్టులు దొంతు రమేశ్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను తెలంగాణ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు.
పిలిచి విచారణ చేసిన తరువాత చర్యలు తీసుకోవాలి కానీ, ఇలాంటి భయంకర వాతావరణం సృష్టించొద్దన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, మహిళా ఐఏఎస్ అధికారిణిపై, కాంగ్రెస్ మంత్రిపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఓ వార్తా ఛానల్ లో వచ్చిన కథనంపై సిట్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం అర్ధరాత్రి ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సిట్ అధికారుల చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి.

Read Also: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు : టీవీకే
Follow Us On : WhatsApp


