కలం, వెబ్ డెస్క్ : తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) స్థాపించిన రాజకీయ పార్టీ టీవీకే (TVK) సంచలన ప్రకటన చేసింది. రానున్న ఎన్నికలలో బీజేపీతో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. టీవీకేను బలవంతంగా తమతో చేర్చుకోవడానికే కేంద్రం “జన నాయగన్” (Jana Nayagan) సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటుంది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రాజకీయంగా ఎన్ని కుట్రలు చేసినా టీవీకే పార్టీ ఎన్డియేతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని టీవీకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ (Nirmal Kumar) క్లారిటీ ఇచ్చారు.
జన నాయగన్ సినిమా విషయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మద్దతు స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం స్నేహపూరిత మద్దతుగా భావిస్తున్నట్లు తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలలో ఎలాంటి మార్పు ఉండదని ప్రజల హితమే అజెండాగా ముందుకు వెళ్తామని టీవీకే (TVK) నేతలు వెల్లడించారు. రాజకీయ లాభాల కోసం సిద్ధాంతాలకు రాజీపడబోమని టీవీకే తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
Read Also: పెరిగిన భారత పాస్పోర్ట్ వాల్యూ.. టాప్లో ఏ దేశం అంటే?
Follow Us On : WhatsApp


