కలం, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని ఏర్పాటు కోసం మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ చేసిన ‘మావిగన్’ (MAVIGUN) ప్రతిపాదనపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. మొన్నటివరకు మూడు రాజధానులన్న జగన్ .. విశాఖలో వందల కోట్లతో ప్యాలెస్ కట్టారని ఆరోపించారు. ఇప్పుడు మావిగన్ అని కొత్త స్వరం అందుకున్నారని విమర్శలు గుప్పించారు. మానసిక పరిస్థితి బాగోలేదు గనుకే ఆయన రాజధానిపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
జనం 11 సీట్లకు పరిమితం చేసినా మారకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుమరుగవడం ఖాయమని చెప్పారు. అటు ఎర్రబస్సు కూడా రనిచోటకు ఎయిర్ బస్సు ఎందుకన్న జగన్.. ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టును తీసుకొచ్చింది తామేనని చెప్పుకోవడంపై గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న శంకుస్థాపన చేసిన ఆర్సెలార్ మిత్తల్ కంపెనీని కూడా తానే తెచ్చానని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే ఈ నెలలోనే రాష్ట్రంలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన జరగుతుందని తెలిపారు. జూన్ నెలలో భోగాపురం ఎయిర్ పోర్టు లాంఛనంగా ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఏపీ ప్రజల 12 ఏళ్ల రాజధాని కాంక్షను తీరుస్తూ అమరావతి బిల్లుకు పార్లమెంటులో సహకరించిన పార్టీలన్నింటికీ గంటా శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
Read Also: BRSలోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి: ముహూర్తం ఫిక్స్ !
Follow Us On: X(Twitter)

