Mobile Popup Ad
Mobile Popup Ad

ఫిఫాలో ఇరాన్ బదులు ఇటలీకి ఛాన్స్?

క‌లం, వెబ్ డెస్క్‌: ఫిఫా వరల్డ్ కప్‌ (FIFA World Cup) 2026లో ఇరాన్ (Iran) ప్లేస్‌తో ఇటలీ (Italy)ని ఆడించాలన్న చర్చ మొదలైంది. ఈ టోర్నీ అమెరికా సహా పలు ఇతర దేశాలు వేదికగా జరగనుంది. ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ టోర్నీలో ఇరాన్ పాల్గొనడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఈ మెగా టోర్నీలో ఇరాన్ దేశానికి బదులుగా ఇటలీ జట్టుకు అవకాశం కల్పించాలని అమెరికా అధ్యక్షుడికి ఒక కీలక ప్రతిపాదన అందింది. ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్యపరమైన గొడవల వల్ల ఇరాన్ రాకపై నీలినీడలు కమ్ముకోవడమే దీనికి ప్రధాన కారణం. అమెరికా ప్రత్యేక ప్రతినిధి పాలో జాంపొల్లి ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్, ఫిఫా బాస్ ఇన్ఫాంటినో దృష్టికి తీసుకెళ్లారు. గతంలో గల్ఫ్ యుద్ధం విషయంలో పోప్ లియో XIVపై ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల ఇటలీ ప్రధాని మెలోనితో ఆయనకు విభేదాలు వచ్చాయి. ఇప్పుడు ఇటలీకి ఈ అవకాశం ఇస్తే, ఇటలీతో దెబ్బతిన్న సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయని జాంపొల్లి భావిస్తున్నారు.

నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ, దురదృష్టవశాత్తూ వరుసగా మూడోసారి వరల్డ్ కప్‌కు క్వాలిఫై కాలేదు. రీసెంట్‌గా బోస్నియా అండ్ హెర్జెగోవినా చేతిలో ఓడిపోయి తృటిలో అవకాశం కోల్పోయింది. అయితే, ఇంతటి గొప్ప చరిత్ర ఉన్న జట్టు అమెరికాలో జరిగే టోర్నీలో ఉండటం తన కల అని, అందుకే ఇరాన్ స్థానంలో ఇటలీని చేర్చాలని జాంపొల్లి కోరుతున్నారు. మరోవైపు ఇరాన్ ఆటగాళ్లు అమెరికా వస్తారా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. దీనిపై ఇరాన్ క్రీడల మంత్రి అహ్మద్ దన్యామలి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రాజకీయ, భద్రతా పరిస్థితుల బట్టే తమ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. తమ జట్టు సిద్ధంగా ఉండాలని ఒక కమిటీని కూడా వేసినట్లు, అయితే జాతీయ భద్రతా మండలి సూచనల మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>