కలం, కరీంనగర్: కేంద్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా నిర్వహిస్తున్న సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం (Sayini Mallesham) ధ్వజమెత్తారు. ఇల్లంతకుంట మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం టిఫిన్ బైటక్ నిర్వహించి, అనంతరం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా సాయిని మల్లేశం మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు ఓటర్లలో గందరగోళం సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని విమర్శించారు. బీజేపీ ఓట్ చోరీ చేస్తుందని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ, మరి 50 ఏళ్లు దేశాన్ని ఎలా పాలించిందో చెప్పాలన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. సర్‌పై కాంగ్రెస్ వైఖరికి నిరసనగా కరీంనగర్లో చేపట్టే భారీ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

