కలం, కరీంనగర్: కొత్తగా కొలువుదీరిన మానకొండూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతుల సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampalli Satyanarayana) పిలుపునిచ్చారు. మానకొండూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆదివారం జరిగిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం ఉచిత విద్యుత్‌పై చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కష్టపడితే గాని పదవి ఇవ్వలేని ఈ రోజుల్లో పదవుల పంపకం కత్తి మీద సాములా మారిందన్నారు. గత సంవత్సర ఛైర్మన్ పదవి బీసీకి, ఈసారి ఎస్టీకి అవకాశం కల్పించినట్లు వివరించారు.
కొత్త పాలకవర్గం వీరే..
మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా రేవెల్లి రాజలింగం, వైస్ ఛైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లుగా ఎర్రాల కవిత, తమ్మిశెట్టి రాజేశ్, రామినేని రమణ, కనకం అశోక్, రేపాక రాజేశ్వర్, కొత్తిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మందల సంపత్ రెడ్డి, ముక్కెర సతీష్ కుమార్, ఆరవేణి రామాంజయ్య, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీర కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు గడి, పల్లె చౌరస్తా మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏకరూప దుస్తుల్లో మహిళల దప్పులు చప్పుళ్ళుతో ముందుకు సాగారు. చౌరస్తాల వద్ద పటాసులు కాల్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నర్సయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్ గౌడ్, ప్యాక్స్ ఛైర్మన్లు, సర్పంచుల ఫోరం మండల ఛైర్మన్ పెంచాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.

