Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాన్ అధ్యక్షుడిగా ఎవర్ని నియమించినా చంపేస్తాం : ఇజ్రాయెల్

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియా యుద్ధం అత్యంత భయంకరంగా మారుతోంది. ఇరాన్ (Iran–Israel) మీద ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో రెచ్చిపోతున్నాయి. టెహ్రాన్ సిటీ మొత్తం బాంబులు పేలిన తర్వాత వచ్చే పొగతో నిండిపోయింది. టెహ్రాన్ వీధులు మొత్తం మండిపోతున్నాయి. దీంతో టెహ్రాన్ సిటీలోని గాలి పూర్తిగా కలుషితం అవుతోందని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా చంపేస్తామంటూ తేల్చి చెప్పింది.

ఇరాన్ కంప్లీట్ గా లొంగిపోవాల్సిందేనని ఇజ్రాయెల్ (Iran–Israel)  స్పష్టం చేసింది. ప్రస్తుత ఇరాన్ అధ్యక్షుడిని త్వరలోనే చంపేస్తామని ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా హెచ్చరించాయి. అటు ఇరాన్ కూడా అస్సలు తగ్గకుండా… ఇజ్రాయెల్ ను సర్వనాశనం చేస్తామని ప్రకటిస్తోంది. అమెరికా మీద బదులు తీర్చుకుంటామని చెబుతోంది. గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ట్యాంకర్లను ఇరాన్ పేల్చేస్తోంది. అటు ఇరాన్ భూభాగం మీద బాంబుల మోతతో అమెరికా విరుచుకుపడుతోంది. ఇరాన్ లోని ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. మూడు దేశాల పరస్పర దాడులతో పశ్చిమాసియా రణరంగంలా మారిపోయింది. యుద్ధం నేటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఏ దేశం కూడా వెనక్కు తగ్గకపోవడంతో.. యుద్ధం సరిహద్దులు దాటుతూ రోజుకో మలుపు తిరుగుతోంది.

Read Also: ఫైనల్‌లో బుమ్రాతో తొలి ఓవర్ వేయించాలి : కుంబ్లే

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>