బిహార్​ డిప్యూటీ సీఎంగా నిశాంత్​!

కలం, వెబ్​ డెస్క్​: బిహార్ (Bihar) సీఎం నితీశ్​ కుమార్​ తనయుడు నిశాంత్​ కుమార్(Nishant Kumar)​ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఆదివారం జేడీయూలో చేరారు. రాజధాని పాట్నాలో ఉన్న జేడీయూ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి రాజీవ్​ రంజన్​ సిన్హా, పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్​ ఝా, అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కండువా కప్పుకొన్నారు.

అనంతరం నిశాంత్​ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి అందరిని కలుపుకొని, పనిచేస్తానని తెలిపారు. రాజ్యసభకు వెళ్లాలనే తన తండ్రి నిర్ణయం గురించి మాట్లాడుతూ అది ఆయన వ్యక్తిగతమని, దాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ‘మా నాన్న రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అది ఆయన సొంత నిర్ణయం. దాన్ని మనమందరం గౌరవించాలి. ఆయన సలహాలతో మనమంతా పనిచేద్దాం. నా వంతు బాధ్యతగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తా’ అని నిశాంత్​ అన్నారు.

కాగా, బిహార్​ ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయి, రాజ్యసభకు వెళ్లేందుకు ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ (Nithish Kumar) రెండు రోజుల కిందట నామినేషన్​ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిశాంత్(Nishant Kumar)​ జేడీయూలో చేరడంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిందనే వార్తలు వస్తున్నాయి. దీనిని జేడీయూ ఎమ్మెల్యే హరి నారాయణ సింగ్ నిర్దారించారు. వచ్చే నెలలో జేడీయూ శాసనసభాపక్ష నాయకునిగా నిశాంత్​ను ఎన్నుకోవడం లాంఛనమేనని చెప్పారు.

Read Also: పాత రూపాయి నోటుకు ఉచితంగా బూట్లు.. ఎగబడ్డ జనం, చివరకు ఏమైందంటే!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>