పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. ఫోటోలు వైరల్

కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్‌కు పెళ్లికళ సంతరించుకుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ ఇంటివారు కాగా, తాజాగా మరో హీరో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas), కావ్య రెడ్డిల రోకా వేడుక (నిశ్చయ తాంబూలాలు) హైదరాబాద్‌లో అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య జరిగింది. అల్లుడు శీను, రాక్షసుడు వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు.

సాంప్రదాయబద్ధంగా జరిగిన వేడుకలో బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడైన శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) కుటుంబం ఈ వేడుకను హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఏడాది చివర్లో వీరి వివాహం (Wedding) జరగనున్నట్టు తెలుస్తోంది.

Read Also: అహ్మదాబాద్ స్టేడియంలో భారత్ రికార్డ్‌లు ఇవీ!

Follow Us On: Pinterest

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>