ఇరాన్ ఆయిల్ డిపోల‌పై ఇజ్రాయెల్ దాడులు

క‌లం, వెబ్ డెస్క్‌: ఇరాన్‌ (Iran)పై ఇజ్రాయెల్‌, అమెరికా ద‌ళాలు యుద్ధం ప్రారంభించి రెండు వారాలు కావొస్తున్నా దాడులు త‌గ్గ‌డం లేదు. ఇరాన్‌లో ప‌రిస్థితులు భ‌యంక‌రంగా ఉన్నాయి. స్కూళ్లు, ఆస్ప‌త్రుల‌పైనా దాడులు జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. తాజాగా టెహ్రాన్‌లోని 3 ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌, అమెరికా ద‌ళాలు దాడులు జరిపాయి. దీంతో డిపోల్లో భారీ ఎత్తున మంట‌లు చెల‌రేగాయి. చైనాకు వెళ్లే ఆయిల్‌లో 15 శాతం ఇక్కడి నుంచే వెళ్తుందని స‌మాచారం. ఇది చైనాకు కూడా ప‌రోక్షంగా తీవ్ర న‌ష్టం క‌లిగించే అంశ‌మ‌ని తెలుస్తోంది.

యుద్ధంలో త‌మ‌కు సహకరించేందుకు చాలా దేశాలు ముందుకొస్తున్నాయని ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెతన్యాహు (Benjamin Netanyahu) వెల్ల‌డించారు. నెత‌న్యాహు ఎక్స్ వేదిక‌గా ఓ పోస్టు చేశారు. మేం సింహంలా గర్జిస్తామ‌ని, ఇజ్రాయెల్ అజేయంగా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో ఉన్న ఇజ్రాయెల్ మనుగడ కోసం తాము చేస్తున్న పోరాటం నిర్ణయాత్మక దశకు చేరుకుందని ప్రకటించారు. శత్రువులపై తమ సైన్యం పూర్తి శక్తితో విరుచుకుపడుతోందని, లక్ష్యాలను సాధించే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు.

సుమారు 40 ఏళ్ల క్రితం లెబనాన్‌లో బందీగా చిక్కిన నావిగేటర్ రోన్ అరాద్ ఆచూకీ కోసం ఇజ్రాయెల్ (Israel) సైన్యం ఒక ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు ప్రధాని వెల్లడించారు. రోన్ అరాద్‌ను తిరిగి తీసుకురావడానికి ఇజ్రాయెల్ దశాబ్దాలుగా విశ్రాంతి లేకుండా ప్రయత్నిస్తూనే ఉందని ఆయన చెప్పారు. తాజాగా చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్‌లో ఆశించిన సమాచారం లేదా ఫలితాలు లభించలేదని నెతన్యాహు అంగీకరించారు. ఫలితం ఎలా ఉన్నా, మిస్ అయిన ప్రతి సైనికుడిని, బందీలను వెనక్కి తీసుకురావడంలో తమ ప్రభుత్వం నిబద్ధతతో ప‌ని చేస్తుంద‌ని, ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు.

 Read Also: మహిళా సాధికారత కోసం పోరాడుదాం: కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>