Mobile Popup Ad
Mobile Popup Ad

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌: టీమిండియా విజయం కోసం ప్రత్యేక పూజలు

కలం, వెబ్ డెస్క్​ : ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ తుది సమరానికి (T20 World Cup Final) సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఈ హై వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ కోసం దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవాలని ఆకాంక్షిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ (Kanpur)లో అభిమానులు సందడి చేస్తున్నారు. స్థానిక దేవాలయాల్లో భారత క్రికెటర్ల చిత్రపటాలను ఉంచి, జట్టు విజయం సాధించాలని కోరుతూ ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు.

డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న సూర్యకుమార్ సేన, కివీస్‌ను కూడా మట్టికరిపించి మూడోసారి టైటిల్‌ను ముద్దాడాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ముఖ్యంగా సంజూ శాంసన్, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు రాణించాలని, భారత్ చరిత్ర సృష్టించాలని కాన్పూర్ (Kanpur) వాసులు ఆకాంక్షిస్తున్నారు. స్టేడియంలో ఆటగాళ్లు చెమటోడిస్తుంటే, బయట కోట్లాది మంది అభిమానులు తమ ఆరాధ్య దైవాలకు మొక్కులు చెల్లిస్తూ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారు.

కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేక పూజలు..

భారత జట్టు విజయం సాధించాలని వారణాసిలో భక్తులు, క్రికెట్ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర గంగా తీరంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య హారతులు ఇచ్చి, టీమిండియా వరుసగా రెండోసారి విశ్వవిజేతగా నిలవాలని గంగా మాతను వేడుకున్నారు.

Read Also: రాష్ట్ర‌ప‌తికి అవ‌మానం.. బెంగాల్ ప్ర‌భుత్వంపై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>