Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళా సాధికారత కోసం పోరాడుదాం: కవిత

కలం, వెబ్​ డెస్క్​ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలోని అన్ని రంగాలలో తమ అద్వితీయ ప్రతిభను కనబరుస్తున్న మహిళా లోకానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) శుభాకాంక్షలు తెలియజేశారు. దేశాభివృద్ధిలో మహిళలు పోషిస్తున్న పాత్ర ఎంతో కీలకమని, వారు శక్తి సామర్థ్యాలతో ముందుకు సాగుతూ దేశానికి వెన్నెముకలా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మహిళా సాధికారత సాధించే దిశగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా పునరంకితం కావాలని కవిత (Kavitha) పిలుపునిచ్చారు. స్త్రీలు స్వయం శక్తితో ఎదిగినప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>