కలం, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్‌లో గురువారం ఉదయం 9గంటలకు భూమి కంపించింది (Israel Earthquake). దేశ దక్షిణ భాగంలోని నెగెవ్ ఎడారిలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో సైరన్లు మోగాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ కంపనలు దేశ కీలక నగరం జెరూసలేం వరకు పాకాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్న సమయంలో ఈ కంపనలు రావడం ఆందోళన రేకెత్తించింది.
ప్రకంపనలు తక్కువ స్థాయిలో ఉండడంతోపాటు అదే సమయంలో దేశంలోని పాఠశాలల్లో మాక్ డ్రిల్స్ జరుగుతుండడంతో ఇవి అణుపరీక్షలు అని చాలా మంది సోషల్ మీడియా వేదికగా అనుమానించారు. భూకంప కేంద్రం (Israel Earthquake) నెగెవ్ ఎడారిలోని డిమోనా సమీపంలో ఉండడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. కారణం, ఇక్కడ అణుపరీక్ష కేంద్రం ఉండడం. దీంతో ఇది కచ్చితంగా అణుపరీక్షే అని సోషల్ మీడియాలో చాలా మంది పోస్టులు పెట్టారు. మరోవైపు డిమోనా ప్రాంతం సిరియాకు ఆనుకొని ఉండడంతో ఇక్కడ తరచూ భూకంపాలు వస్తుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే, అమెరికా తమ మీదకు దాడికి దిగితే తాము ఇజ్రాయెల్ ను లక్ష్యంగా ఎంచుకుంటామని ఇరాన్ (Iran) ప్రకటించిన నేపథ్యంలో ఇది కచ్చితంగా అణుపరీక్షే అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
Read Also: తడబడినా బోణీ కొట్టిన యువ భారత్
Follow Us On : WhatsApp


