కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీశైలం (Srisailam)లో సంక్రాంతి బ్రహోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ ఉత్సవాల్లో స్థానిక చెంచులు ప్రత్యేకార్షణగా నిలుస్తుంటారు. మల్లికార్జున స్వామిని తమ ఇంటి అల్లుడిగా భావించి పూజలు చేస్తుంటారు.
స్వామి, అమ్మవార్లకు కళ్యాణ వేడకకు చెంచులు (Chenchu) భారీగా హాజరై కల్యాణం జరిపించారు. గిరిజనులను ఆచారాల ప్రకారం స్వామి వారికి పూజలు చేశారు. ఈ వేడుకకు దాదాపు 350 మంది హాజరయ్యారు. కేవలం శ్రీశైలంలో పరిధిలోనే కాకుండా నల్లమల ఫారెస్టులో ఆలయాల్లో చెంచులు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. సలేశ్వర ఉత్సవాల్లోనూ గిరిజనులే ఆలయ పూజారులుగా వ్యవహరించి పూజలు చేస్తుంటారు. ఇదే ఇక్కడి ప్రత్యేకత


