కలం, మెదక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పారదర్శకంగా వడ్లు కొనుగోలు చేస్తుంటే, రైతుల ధర్నా పేరుతో ప్రభుత్వం ఒక్క గింజ కూడా కొనలేదని అబద్దాలు ఆడిన హరీష్ రావు (Harish Rao) ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని చిన్నకోడూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మహేందర్ యాదవ్ (Mahender Yadav) డిమాండ్ చేశారు. చిన్నకోడూరు మండలంలో రైతుల నుండి ఇప్పటి వరకు సుమారు 18,000 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని అన్నారు. అయితే నిన్న ప్రభుత్వం వరి కొనుగోలు చేయడం లేదని మల్లారం వద్ద హరీష్ రావు ధర్నా చేయడం సరికాదన్నారు.
రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి హరీష్ రావు వడ్ల కొనుగోలు విషయంలో రైతులను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా సిద్దిపేటలోనే సమస్య సృష్టించి కుట్రలు పన్నుతూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. మీరు చెప్పేదానికి కట్టుబడి ఉంటే ధాన్యం కొనుగోలు అంశంపై హరీష్ రావు గానీ , బీఆర్ఎస్ నాయకులు గానీ చర్చకు రావాలని సిద్దిపేట మహేందర్ యాదవ్ (Mahender Yadav) సవాల్ విసిరాడు.
Read Also: తెలంగాణ క్యాబినెట్ విస్తరణ : ఈసారి రెడ్లకు నో ఛాన్స్!!
Follow Us On: Pinterest

