కలం, యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah).. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ‘ఖబర్ధార్ ఐలయ్య’, ‘డౌన్ డౌన్ ఐలయ్య’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధాన కూడలిలో బీర్ల ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ.. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రిగా రాష్ట్రానికి సేవలందించిన హరీశ్ రావు హోదాను మరిచి విమర్శించడం సరికాదని అన్నారు. అదిష్టానం మెప్పుకోసం అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని సూచించారు.
అలాగే, అధికారంలో ఉన్నామని అహంకారంగా వ్యవహరిస్తే తగిన గుణపాఠం చెబుతామని అన్నారు. వరిధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, రైతులు త్వరలోనే నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. చివరగా, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే హరీశ్ రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పట్టణ మాజీ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, యువజన విభాగం నాయకులు ముక్యర్ల సతీష్ యాదవ్, బాలయ్య, సర్పంచ్ గడ్డం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: తారుమారైన ఐదు రాష్ట్రాల ఫలితాలు.. కేసీఆర్‌పై భారీగా ట్రోల్స్!
Follow Us On : WhatsApp

