కలం, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని (Dhoni) వివాదంలో చిక్కుకున్నాడు. ఎయిర్పోర్ట్ తనిఖీ కేంద్రం వద్ద చేతి గడియారం, ఫిట్నెస్ డివైజ్ తీయకుండానే మెటల్ డిటెక్టర్ గుండా విమానాశ్రయం లోపలికి వెళ్లాడు. వాస్తవానికి వాటిని తీసి స్కానర్ టేబుల్‌పై పంపాలి. అయితే, తన భుజానికి ఉన్న బ్యాగును మాత్రం స్కానర్ టేబుల్‌పై పెట్టిన ధోని.. వాచ్, ఫిట్నెస్ డివైజ్ తీయలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది, ఎయిర్పోర్ట్ అధికారుల తీరుపై విమర్శలు చెలరేగాయి. ధోనీకి రూల్స్ వర్తించవా? అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధించారు.
సామాన్యులెవరైనా వెళితే తమ వస్తువులన్నీ తీసి, స్కానర్‌లో పెట్టేంతవరకు విమానాశ్రయ అధికారులు లోపలికి అనుమతించరని, అలాంటిది ధోని (Dhoni) ని ఎలా పంపించారని అడుగుతున్నారు. విమానాశ్రయాల్లో వీఐపీ కల్చర్ ఏంటని ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బందిని, కేంద్ర విమానయాన శాఖను ట్యాగ్ చేస్తూ ట్వీట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు. కొందరు ధోని తీరును సైతం తప్పుపట్టగా, మరికొందరు మద్దతుగా మాట్లాడుతున్నారు. ధోని దేశం పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఆర్మీలో ఆఫీసర్ హోదా ఉందని గుర్తుచేస్తున్నారు. మెటల్ డిటెక్టర్ దాటిన తర్వాత పోలీసుల తనిఖీకి సహకరించింది వీడియోలో గమనించాలని చెప్తున్నారు.
Read Also: KKR ముస్తాఫిజుర్ బిడ్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Pinterest


