epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

నా మనవడిని మెస్సీ మ్యాచ్​కు అందుకే తీసుకెళ్లా : సీఎం రేవంత్​

కలం, వెబ్ డెస్క్​ : ఫుట్ బాల్​ దిగ్గజం లియొనల్​ మెస్సి గత కొద్ది రోజుల క్రితం ఇండియా గోట్ టూర్​(Goat India Tour) లో భాగంగా హైదరాబాద్ లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్​ లో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)  సింగరేణి ఆర్ఆర్​ టీమ్ తరఫున పాల్గొంటే అపర్ణ టీమ్​ తరఫున మెస్సీ ఆడాడు. మ్యాచ్ అనంతరం రేవంత్​ రెడ్డి తన మనవడితో గ్రౌండ్ లో మెస్సీ (Lionel Messi) తో పాటు ఆడించాడు. ఫోటోలు కూడా దిగారు. అయితే, దీనిపై బీఆర్​ఎస్​ (BRS) తీవ్రస్థాయిలో మండిపడింది. గతంలో కేసీఆర్​ (KCR) మనవడిపై రేవంత్​ రెడ్డి కామెంట్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ విమర్శలు చేశారు. అలాగే, మెస్సీ మ్యాచ్​ కోసం ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు.

కాగా, ఈ కామెంట్లపై సీఎం రేవంత్​ రెడ్డి స్పందించారు. గురువారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశం అనంతరం పాత్రికేయులతో చిట్​ చాట్​ చేశారు. మెస్సీ మ్యాచ్​ కు తన మనవడిని ఫుట్ బాల్​ ఆడడం కోసం తీసుకెళ్లానని, కానీ, కేసీఆర్​ ఫ్యామిలీ లాగా పబ్బులు, గబ్బుల చుట్టూ తిప్పడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మెస్సీ పర్యటన పూర్తి ప్రైవేట్​ కార్యక్రమం అని దానికి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే, తాను కూడా కేవలం గెస్టులాగే వెళ్లానన్నారు. సింగరేణి యాజమాన్యం అడ్వర్టైస్​ మెంట్ కోసం రూ.10 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కేసీఆర్​ ను ఆయన కొడుకే బయటకు తీసుకువస్తున్నాడని.. తాను కేసీఆర్ ను ఓడించే ముఖ్యమంత్రి అయ్యానని రేవంత్​ రెడ్డి (Revanth Reddy) చెప్పారు.

Read Also: ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్లు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>