Mobile Popup Ad
Mobile Popup Ad

లవర్​ మోజులో.. భర్తను కడతేర్చిన భార్య!

కలం, ఖమ్మం బ్యూరో : పచ్చని సంసారంలోకి పరాయి వ్యక్తి ప్రవేశించాడు. ఇద్దరూ కలిసి పథకం ప్రకారం భర్తను పొట్టన పెట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా పెను దుమారం రేపుతోంది. పాల్వంచ మండలం, మొండికట్ట గ్రామానికి చెందిన ప్రసాద్, కృష్ణవేణి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అప్పుడప్పుడు బార్య, భర్తలు మధ్య చిన్న చిన్న కలహాలు వస్తుండటంతో, ఆరు నెలల క్రితం కృష్ణవేణి భర్తను వదిలి హైద్రాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు భర్త తరఫు బంధువులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడితో కలిసి భర్తను హతమార్చాలని (Wife Murders Husband) పన్నాగం పన్ని, మార్చి 25 న ప్రసాద్ కు పోన్ చేసి ప్రేమగా మాట్లాడి హైద్రాబాద్ పిలిపించుకుంది.

హైదరాబాద్ వెళ్ళిన ప్రసాద్ ను.. కృష్ణవేణి తన ప్రియుడితో కలిసి విచక్షణ రహితంగా దాడి చేసి హింసించిందని ప్రసాద్ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. తీవ్ర అనారోగ్యం పాలైన ప్రసాద్, అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకొని వచ్చి భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. అక్కడ పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రసాద్ ప్రాణాలు కాపాడ లేక పోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కామంతో కళ్ళు మూసుకుపోయి, కట్టుకున్న భర్త ను ప్రియుడితో కలిసి చిత్రహింసలు పెట్టి, పేగులు చిట్లేల కొట్టి హతమార్చినట్లు (Wife Murders Husband) పోస్ట్ మార్టం ఫోటోల ద్వారా తెలుస్తోంది. దీంతో కృష్ణవేణి కటకటాల పాలవ్వడం ఖాయం అని స్థానికులు అంటున్నారు. ఒక పక్క తండ్రి మరణం, మరో పక్క తల్లి జైలుకి వెళ్లనుండటంతో ఇద్దరు పిల్లలను ఎవరు చూస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తాత్కాలిక సుఖాల కోసం వెంపర్లాడిన కృష్ణవేణి నీ కఠినంగా శిక్షించాలనీ స్థానికులు, ప్రసాద్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Read Also: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం ప్రకటన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>