కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ యూనివర్సిటీ (Telangana University) లా స్టూడెంట్స్ నిజామాబాద్ లోని కవిత కాంప్లెక్స్ లోని రిజిస్ట్రేషన్ ఆఫీస్ కార్యాలయాన్ని సందర్శించారు. లా డిపార్ట్ మెంట్ ప్రొఫెసర్ స్రవంతి సూచన మేరకు పాఠ్యాంశం (LAW OF PROPERTY) లో భాగంగా ఈ స్టడీ టూర్ చేపట్టారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో సబ్ రిజిస్ట్రార్ రవికాంత్, అధికారులు సతీష్, ప్రసాద్ లను కలిశారు. ప్రాపర్టీ ల రిజిస్ట్రేషన్ ల గురించి వాటి క్రయ విక్రయాల గురించి అధికారులు ఈ సందర్భంగా స్టూడెంట్స్ కు వివరించారు.
విద్యార్థులకు వచ్చిన సందేహాలను నివృత్తి చేస్తూ క్లుప్తంగా వివరించారు. అవగాహన కోసం చేపట్టిన ఈ స్టడీ టూర్ తమకు ఎంతగానో ఉపయోగ పడుతుందని థియరీతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ లు ఉంటేనే మరింత అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందని యూనివర్సిటీ (Telangana University) లా స్టూడెంట్స్ చెప్పుకొచ్చారు. అందుకే లా ప్రొఫెసర్ స్రవంతి సలహాలు సూచనల మేరకు స్టడీ టూర్ లు సద్వినియోగం చేసుకుంటున్నట్టు వివరించారు.
Read Also: కర్ణాటకలో బస్సు భీభత్సం.. రెండేళ్ల బాలుడు మృతి, పలువురికి గాయాలు
Follow Us On: Instagram

