మాయమాటలతో బాలికపై లైంగికదాడి.. నిందితుడికి జీవిత ఖైదు

కలం, ఖమ్మం బ్యూరో: పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారిపై మాయమాటలతో అరాచకానికి ఒడిగట్టిన నిందితుడికి ఖమ్మం (Khammam) మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించింది. చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడిన నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదుతోపాటు రూ.57 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి డాక్టర్ పుల్లభట్ల పోగడ కృష్ణ అర్జున్ బుధవారం తీర్పునిచ్చారు. కేసులో సమర్థవంతంగా పనిచేసిన ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కేసు వివరాలను టూ టౌన్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా అంజనపురి కాలనీకి చెందిన అల్లి రాకేశ్ (22) గతంలో బాధితురాలి ఇంటి పక్కనే ఉండేవాడు. 2023 సెప్టెంబర్ 20న పాఠశాలకు వెళ్లిన బాలికను మాయమాటలు చెప్పి బలవంతంగా బయటకు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ​పోలీసులు సాక్ష్యాధారాల సేకరణను వేగవంతంగా పూర్తిచేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో భాగంగా కేసు పూర్వాపరాలు, బలమైన సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో తీర్పునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>