యుద్ధం ముగింపుపై ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్ : అమెరికా – ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను గౌరవప్రదంగా ముగించాలని కొరుకుంటున్నామని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ (Iran President) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశ హక్కులను కాలరాయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేశారు. అణు హక్కులను ఉపయోగించకూడదని ట్రంప్ అంటున్నారు.. కానీ తాము చేసిన నేరం ఏంటో చెప్పడం లేదన్నారు. రక్తపిపాసి, క్రూరమైన శత్రువుకు వ్యతిరేకంగా ఇరాన్ వాసులు ధృఢంగా నిలబడాలని అని పెజెష్కియన్ పిలుపునిచ్చారు. ఆత్మరక్షణ కోసం తప్ప యుద్ధోన్మాదాలుగా చిత్రీకరించని విధంగా ప్రస్తుత వాతావరణాన్ని సృష్టించుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశంలో భద్రతను పరిరక్షించే బాధ్యత తమపై ఉందని ఉందని పెజెష్కియన్ వెల్లడించారు.

Read Also: ఆపరేషన్ ఆక్టోపస్ 2.0.. దేశ వ్యాప్తంగా 52 మంది అరెస్ట్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>