Mobile Popup Ad
Mobile Popup Ad

రాధిక‌కు నేష‌న‌ల్ అవార్డ్ ఖాయం.. డైరెక్ట‌ర్ భార‌తీరాజా ప్ర‌శంస‌లు!

క‌లం, వెబ్‌డెస్క్‌: త‌మిళ‌నాడు దిగ్గ‌జ డైరెక్ట‌ర్‌ భారతీరాజా (Bharathiraja) సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌ (Radikaa Sarathkumar)ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇటీవల అనారోగ్యం నుంచి కోలుకుంటున్న తన గురువు భారతీరాజాను రాధిక ఆదివారం ప్రత్యేకంగా క‌లిసి ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా రాధిక నటించిన లేటెస్ట్ మూవీ ‘తాయ్ కిళవి’లోని ఆమె నటనను భారతీరాజా అభినందించారు. ఈ క్యారెక్ట‌ర్‌లో రాధిక న‌ట‌న‌కు ఖచ్చితంగా నేష‌న‌ల్ అవార్డు వస్తుందని చెప్ప‌డం విశేషం.

త‌న గురువు నోటి నుంచి వ‌చ్చిన ఆ ప్ర‌శంస‌లు విన‌గానే రాధిక ఎంతో ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌న గురువు (Bharathiraja) ప్ర‌శంస‌లు త‌న‌కు జాతీయ అవార్డు కంటే గొప్ప‌వేన‌ని రాధిక సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించా. వీరిద్దరూ క‌లిసిన‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భార‌తీరాజాతో పాటు సినీ ప్ర‌ముఖులంతా తాయ్ కిళ‌విలో రాధిక న‌ట‌న‌కు ఫిదా అవుతున్నారు. సినిమాలో రాధిక చెప్పిన డైలాగులు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

Read Also: రెండో ‘సారీ’.. ప్రజలకు ప్రధాని మోడీ…

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>