కలం, వెబ్ డెస్క్: కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడంలో చైనా (China) కంట్రీ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే డ్రోన్స్, ఎయిర్ టాక్సీలు లాంటివన్నో రూపొందించిన చైనా మరో కొత్త ఆవిష్కరణ చేసింది. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతూ, అధునాతన సెల్ఫ్-డ్రైవింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను (Self Driving Electric Scooters) ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ప్రధానంగా నగరాల్లో ప్రయాణాలను సులభతరం చేయడానికి, వస్తువుల డెలివరీ కోసం ఈ స్కూటర్లను రూపొందించింది. ఆటో బ్యాలెన్స్ (తానంతట తాను బ్యాలెన్స్ చేసుకోవడం), అడ్డంకులను గుర్తించడం, స్మార్ట్ నావిగేషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
వీటిని రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా నియంత్రించవచ్చు. ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణ ప్రాంతాల్లో లాస్ట్ మైల్ డెలివరీ సమస్యలను పరిష్కరించవచ్చు. సాధారణ ప్రయాణికులకు శ్రమలేని ప్రయాణాన్ని అందించడానికి సాంకేతికత స్కూటీలు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈస్కూటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

