భారత్‌లో ఇరాన్ మంత్రి పర్యటన..

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ విదేశాంగ మంత్రి (Iran Foreign Minister) సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ  (Seyed Abbas Araghchi) భారత్ లో పర్యటిస్తున్నారు. ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొననున్నారు. మే 14, 15 రెండు రోజుల పాటు జరిగే సదస్సు కోసం అరాగ్చీ భారత్ చేరుకున్నారు. కాగా, అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల వేళ ఇరాన్ మంత్రి భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పర్యటనలో ఇరు దేశాల మధ్య పటిష్టమైన బహుపాక్షిక చర్చలు జరగనున్నాయి. అలాగే, హర్మూజ్ జలసంధి నుంచి భారత నౌకల సులభతర రవాణాపై ఇరాన్ మంత్రితో కేంద్రం చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రారంభమైన అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల దౌత్య సమావేశం కీలకంగా మారనుంది. కాగా, విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అరాగ్చి మొట్టమొదటి సారిగా భారత్ లో పర్యటించడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>