పొంగులేటి అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం(Congress Meeting) నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఎదురయ్యే ముప్పుపై ముందస్తు సన్నద్ధత, ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమ నిర్వహణ, రానున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ శ్రేణుల సమాయత్తంపై ఈ సమావేశంలో కీలక చర్చలు జరిపారు.

వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని అధికారులు, నాయకులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, పట్టభద్ర ఓటర్లతో నిరంతర సమన్వయం పెంచుకోవాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కోఆర్డినేటర్ మేడి వెంకటేశ్, పీసీసీ కోఆర్డినేటర్ దుద్దిళ్ల శ్రీనుబాబు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కోరెం కనకయ్య, జారే ఆదినారాయణ, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>