షాహీన్‌ అఫ్రిది 150 వన్డే వికెట్లు.. పాక్‌ పేసర్‌ రికార్డు

క‌లం, స్పోర్ట్స్‌: పాకిస్థాన్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది (Shaheen Afridi) వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ట్రై సిరీస్‌ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే టామ్‌ బాంటన్‌ను ఔట్‌ చేసి 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ తరఫున అత్యంత వేగంగా 150 వన్డే వికెట్లు తీసిన ఫాస్ట్‌ బౌలర్‌గా నిలిచాడు. షాహీన్‌ ఈ ఘనతను 80వ వన్డేలోనే సాధించాడు. గతంలో వకార్‌ యూనిస్‌, షోయబ్‌ అక్తర్‌ ఈ మైలురాయిని చేరేందుకు 91 మ్యాచ్‌లు ఆడారు. వారిద్దరినీ వెనక్కి నెట్టి షాహీన్‌ రికార్డు నెలకొల్పాడు. పాకిస్థాన్‌ బౌలర్లలో మాత్రం సక్లైన్‌ ముస్తాక్‌ ముందున్నాడు. అతడు 78 మ్యాచ్‌ల్లోనే 150 వికెట్లు పడగొట్టాడు.

ప్రపంచ స్థాయిలోనూ షాహీన్‌ అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నాడు. నేపాల్‌ బౌలర్‌ సందీప్‌ లామిచానే 73 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మిచెల్‌ స్టార్క్‌ 77 మ్యాచ్‌లతో రెండో స్థానంలో, సక్లైన్‌ ముస్తాక్‌ 78 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నారు. షాహీన్‌తో పాటు రషీద్‌ ఖాన్‌, మహమ్మద్‌ షమీ కూడా 80 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>