Mobile Popup Ad
Mobile Popup Ad

డీఎస్పీగా ప్రమోషన్.. ఎస్పీ అభినందన

కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల జిల్లా పోలీస్ శాఖలో డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ డీఎస్పీగా (DSP) పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శుక్రవారం ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలవగా.. శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో పనిచేస్తూ ఎన్నో ఏళ్లుగా ప్రజా సంరక్షణ కోసం అవిశ్రాంతంగా చేస్తున్న కృషికి పదోన్నతి ఒక గొప్ప గుర్తింపు అన్నారు. పదోన్నతి అనేది ఉద్యోగి జీవితంలో మైలురాయి వంటిదన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖలో మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>