Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్.. ట్రంప్ సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. యుద్ధం వల్ల హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేయడంతో ప్రపంచం వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. యుద్ధం ప్రారంభమై ఐదు వారాలు గడిచిన వేళ పలు దేశాల్లోని పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడనే వార్త ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్ ను కలగజేస్తోంది. ఇరాన్‌పై సైనిక చర్యను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ (Trump) సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు “ది వాల్ స్ట్రీట్ జర్నల్” ఓ కథనాన్ని వెలువరించింది. ఈ మేరకు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury)ను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అన్నారని “ది వాల్ స్ట్రీట్ జర్నల్”లో కథనం వెలువడడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే యుద్ధం ఆరంభంలో ఆరువారాల్లోపు యుద్ధం ముగుస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆ తర్వాత జరిగిన అనేక పరిణామాలతో యుద్ధం ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచ దేశాలు తీవ్రమైన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్లిష్టమైన పరిస్థితుల వల్ల యుద్ధకాలం మరింత పొడుగుతుందని ట్రంప్ (Trump) భావిస్తున్నారట. ఈ క్రమంలోనే హార్ముజ్ జలసంధిని ఇరాన్ నియంత్రణలోనే వదిలేసి.. తన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడంపైనే దృష్టి సారించాలని ట్రంప్ నిర్ణయించారని తెలుస్తోంది.

అయితే ఈ కథనాలు ఇలాఉంటే.. మరోవైపు పశ్చిమాసియాలో అమెరికా బలగాల మోహరింపులు పెరుగుతుండటం గమనార్హం. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ యుద్ధం నెలల తరబడి కాకుండా, మరికొన్ని వారాల్లోనే ముగిసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదని కొందరు అంటున్నారు. దీంతో “ది వాల్ స్ట్రీట్ జర్నల్” కథనంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: శీతల మాతా ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది భక్తులు మృతి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>