Mobile Popup Ad
Mobile Popup Ad

ఆదివాసీ కుటుంబానికి ఇల్లు ఇచ్చారు.. బిల్లు మరిచిపోయారు!

కలం, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వాలు మారినా, పథకాలు వస్తున్నా క్షేత్రస్థాయిలో పేదవాడి తలరాతలు మాత్రం మారడం లేదు. పేదలకు గూడు కల్పించాలనే ప్రభుత్వ ఆశయానికి కొందరు అధికారుల నిర్లక్ష్యం శాపంగా మారుతోంది. అందుకు ఉదహరణే భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem)  జిల్లాలో ఓ నిరుపేద ఆదివాసీ కుటుంబం. అప్పులు తెచ్చి ఇల్లు కట్టుకుంటే.. ఇప్పుడు బిల్లు రాకపోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పాల్వంచ మండలం మల్లారం గ్రామంలో ఈసం మీన, విజయ్ కుమార్ దంపతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. సొంతింటి కల నెరవేరుతుందన్న ఆనందంతో, చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అష్టకష్టాలు పడి, తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ​తీరా పనులు పూర్తి చేసి బిల్లు కోసం దరఖాస్తు చేసుకుంటే, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది. వారితో పాటు ఇళ్లు మంజూరైన ఇతర లబ్ధిదారులకు బిల్లులు ఎప్పుడో విడుదలయ్యాయి. విజయ్ కుమార్ కుటుంబానికి మాత్రం బిల్లు రావడం లేదు. దీంతో అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తుండటంతో కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది.

పట్టించుకోని అధికారులు..

​బిల్లు విషయమై అధికారులను పలు మార్లు సంప్రదించినా వారి నుంచి కనీసం స్పందన లేదని విజయ్ కుమార్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని మల్లారం గ్రామ ప్రజలు సైతం కోరుతున్నారు. తక్షణమే విచారణ జరిపి, పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇంటి బిల్లు విడుదల చేసి, నిరుపేద ఆదివాసి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా.. లేక కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటారా.. అనేది చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>