విమానంలో సాంకేతిక లోపం: శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

కలం, వెబ్‌ డెస్క్‌ : బెంగళూరు నుండి నాగ్‌పూర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్య తలెత్తింది. గగనతలంలో ఉండగానే ఈ లోపాన్ని గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ (Shamshabad Airport) అధికారులను సంప్రదించారు. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.

సమాచారం అందుకున్న శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది రన్‌వేపై తగిన ఏర్పాట్లు చేశారు. పైలట్ చాకచక్యంగా విమానాన్ని శంషాబాద్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న 126 మంది ప్రయాణికులు క్షేమంగా కిందకు దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Also: ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా డాక్టర్ రోస్ రివాజ్ నియామకం

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>