Mobile Popup Ad
Mobile Popup Ad

హీరో అజిత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం

కలం, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar) ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి మోహిని మణి (84) వృద్యాప్య సమస్యలతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లో ఉన్న అజిత్ హుటాహుటిన చెన్నైకి బయలుదేరారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. మోహిని మణి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, అజిత్ తండ్రి పి.ఎస్. మణి (పి. సుబ్రమణ్యం) 2023లో అనారోగ్యంతో కన్నుమూశారు.

అజిత్ కుమార్ (Ajith Kumar) కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, అంతర్జాతీయ మోటార్ రేసింగ్ ప్రపంచంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటలీలో జరిగిన అంతర్జాతీయ రేసింగ్ పోటీల్లో ఆయన “జెంటిల్‌మెన్ డ్రైవర్ ఆఫ్ ది ఇయర్” అవార్డును గెలుచుకున్నారు. అలాగే దుబాయ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక 24H కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో అజిత్ రేసింగ్ బృందం మూడో స్థానాన్ని కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇటీవల ‘విదాముయార్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో మెప్పించిన అజిత్.. ప్రస్తుతం దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో కలిసి ‘AK 64’ అనే మరో భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు.

Read Also: లోన్, క్రెడిట్ కార్డ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ యాప్‌తో చెక్ పెట్టండి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>