Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ కు ఊరట.. AICC హెడ్ ఆఫీస్ ఖాళీ చేయించే ప్రక్రియ నిలిపివేత!

కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత ఆప్తమైన, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన 24 అక్బర్ రోడ్ ప్రధాన కార్యాలయ భవనాన్ని (AICC Headquarters) ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28 లోగానే సదరు బంగ్లాను ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని డెడ్ లైన్ విధించింది. దీంతో ఆ ప్రాంగణాన్ని తన వద్దే ఉంచుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట లభించింది. AICC హెడ్ ఆఫీస్ ఖాళీ చేయించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు 24 అక్బర్ రోడ్ భవనం ఖాళీ చేయాలన్న ఆదేశాలకు స్మాల్ బ్రేక్ ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీకి తాత్కాలిక ఉపశమనం లభించింది.

నోటీసులు ఎందుకు ఇచ్చారంటే?

నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీలు తమకు కేటాయించిన సొంత స్థలాల్లో కార్యాలయాలు నిర్మించుకున్న తర్వాత ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కోట్ల మార్గ్‌లోని ఇందిరా భవన్‌కు తన ప్రధాన కార్యాలయాన్ని గత ఏడాది మార్చింది. అయినప్పటికీ పాత కార్యాలయమైన 24 అక్బర్ రోడ్ (AICC) ఆఫీసును ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే గత 48 ఏళ్లుగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంగా కొనసాగిస్తున్న ఆ ఆఫీసును ఖాళీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>