కలం, వెబ్ డెస్క్ : రైలులో ఫస్ట్ క్లాస్స్ ఏసీ కూపేను ప్రత్యేకంగా బుక్ చేసుకున్న ఓ యువ జంట.. దానిని శోభనం గదిలా సిద్దం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. బల్లార్షా నుంచి ముంబై వెళ్తున్న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్(Nandigram Express) రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇండియన్ రైల్వే(Indian Railways) నిబంధనలకు విరుద్ధంగా కోచ్‌లో అలంకరణలు ఏర్పాటు చేసిన ఘటనపై విచారణ చేపట్టి, విధులలో నిర్లక్ష్యం వహించిన టీటీఈని సస్పెండ్ (TTE Suspend) చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ఆస్తులను వ్యక్తిగత కార్యక్రమాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.

