Mobile Popup Ad
Mobile Popup Ad

కూలిన ఆర్మీ హెలికాప్టర్.. సెల్ఫీ తీసుకున్న మేజర్

కలం, వెబ్ డెస్క్ : లద్దాఖ్ లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటన (Army Helicopter Crash) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తంగ్ స్టే రీజియన్ లో జరిగిన  ప్రమాదం సమయంలో హెలికాప్టర్ లో లెఫ్ట్‌నెంట్ కల్నల్, మేజర్, మేజర్ జనరల్ ప్రయాణిస్తున్నారు.  సాంకేతిక లోపం తలెత్తడంతో చాపర్ ఒక్కసారిగా కూలిపోయింది.

ఈ ప్రమాదం నుంచి ముగ్గురు అధికారులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మే 20న చోటుచేసుకోగా తాజాగా వివరాలు బయటకు వెల్లడయ్యాయి. హెలికాప్టర్ కూలిన తరువాత దాని పక్కనే మేజర్ జనరల్ సచిన్ మెహతా సెల్ఫీ తీసుకున్నారు. తాము క్షేమంగా ఉన్నామని వీడియో ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఈ సెల్ఫీ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా, ప్రమాదంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: కిడ్నీ శస్త్రచికిత్సలు పూర్తి కావడం వైద్యరంగానికి గర్వకారణం: రాజనర్సింహ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>