Mobile Popup Ad
Mobile Popup Ad

ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వివాదం

కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao), పాల్వంచ సీఐ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. సీఐ దురుసుగా ప్రవర్తించాడంటూ ఎర్ర దండు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మున్సిపల్ పోలింగ్ నేపథ్యంలో ఒక మహిళను దొంగ ఓటు ఆరోపణలతో పోలీసులు స్టేషన్లో నిర్బంధించారు. అమాయకురాలిని అనవసరంగా అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యేతో సహా పార్టీ శ్రేణులు సీఐ ని అడగటానికి స్టేషన్ కు వెళ్లారు. అయితే, ఎస్ హెచ్ఓ వారి పట్ల మర్యాద లేకుండా ప్రవరించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన సీపీఐ కార్యకర్తలు సీఐ క్షమాపణ చెప్పే వరకూ కదిలేది లేదని ఎమ్మెల్యేతో సహా స్టేషన్ ఆవరణలో బైఠాయించారు. దీంతో పోలింగ్ ముగిసిన తరువాత పాల్వంచలో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

Read Also: కరీంనగర్‌లో ‘పొత్తు’ పొడుపు – కమలం, గులాబీ స్నేహం ?

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>