epaper
Wednesday, February 18, 2026
epaper

దొంగఓట్ల విషయంలో ఈసీ ఫెయిల్ : జగ్గారెడ్డి

కలం,మెదక్ బ్యూరో : దొంగ ఓట్లను తొలించడంలో ఎలక్షన్ కమిషన్, అధికారులు ఫెయిల్ అయ్యారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) ఆరోపించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో (Sangareddy Municipality) పోలింగ్ సందర్భంగా జరిగిన గొడవపై ఎన్నికల కమిషన్ స్పందించి… జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈసీ ఆదేశాలపై జగ్గారెడ్డి స్పందించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని తెలిపారు. అలా అడ్డుకుంటే కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివ కుమార్ పట్టుకున్నారని.. దీంతో తాను పోలింగ్ బూత్ వద్దకు వెళ్తే గొడవ జరిగిందని జగ్గారెడ్డి వివరించారు.

ఎలక్షన్ కమిషన్ (EC) ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులని.. దీనికి ఈసీ జవాబు చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. దొంగ ఓట్లు తొలగించడంలో ఎన్నికల కమిషన్, అధికారులు విఫలమై.. దొంగ ఓటర్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టమని ఎన్నికల కమిషన్ చెప్పడం ఏంటని జగ్గారెడ్డి (Jagga Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: తలాక్​ ఎ హసన్​పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>