కలం, స్పోర్ట్స్ : త్వరలో జరగబోయే పికెల్‌బాల్ వరల్డ్‌కప్ (Pickleball World Cup) కోసం భారత అండర్-18, అండర్-14 జట్లను బుధవారం ప్రకటించారు. అండర్-18 విభాగానికి అర్జున్ సింగ్, అండర్-14 విభాగానికి వీర్ షా కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఈ మెగా టోర్నీ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జట్ల ఎంపిక కోసం అహ్మదాబాద్‌లో జూన్ 12 నుంచి 14 వరకు అధికారిక సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. ఈ ట్రయల్స్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను వరల్డ్‌కప్ కోసం ఎంపిక చేశారు. ఈ ఏడాది ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 6 వరకు వియత్నాంలోని దానాంగ్‌లో ఈ ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ పోటీలు జరగనున్నాయి.
ప్రకటించిన భారత జట్లు చాలా బలంగా ఉన్నాయని కెప్టెన్ అర్జున్ సింగ్ (Arjun Singh) ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని నమ్మకం ఉందన్నారు. భారత పికెల్‌బాల్ అసోసియేషన్ (IPA) అధ్యక్షుడు సూర్యవీర్ సింగ్ భుల్లార్ కూడా జట్టుపై పూర్తి నమ్మకాన్ని కనబరిచారు. మన ఆటగాళ్లు దేశం గర్వపడేలా ఆడతారని, వారి ఆట చూసి స్వదేశంలో ఎంతోమంది పిల్లలు ఈ క్రీడ వైపు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Pickleball World Cup – భారత జట్ల వివరాలు:
అండర్-18 జట్టు :
అర్జున్ సింగ్ (కెప్టెన్), ఆదిత్య సింగ్, నవోమి అమల్సదివాలా, దేవ్ షా, పూర్వాన్ష్ పటేల్, వివరాన్ పటేల్, ఆశ్రిత రాజు, దియా మత్తిపాటి.
అండర్-14 జట్టు:
వీర్ షా (కెప్టెన్), వీరాన్ష్ చోప్రా, ఆరిన్ బల్లానీ, మహికా రాథోడ్, మాన్సి కార్తీక్, ఆశ్రిత ఎస్.
భారత ఆటగాళ్లు వియత్నాం వేదికగా ఎలాంటి ప్రదర్శన చేయబోతున్నారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Read Also: గిల్, ఇషాన్ సెంచరీల మోత.. వన్డేల్లో భారత్ సరికొత్త ప్రపంచ రికార్డు!
Follow Us On: Sharechat

