కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా భారతదేశం త్వరలో మారబోతోంది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆదివారం గుజరాత్ రాజ్కోట్ లో (Rajkot) జరిగిన వైబ్రంట్ గుజరాత్ కాన్ఫరెన్స్ (Vibrant Gujarat Conference) ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయన్నారు. పాల ఉత్పత్తిలో, డిజిటల్ లావాదేవీల్లో మనమే మొదటి స్థానంలో ఉన్నామని.. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు.
కృషి, పట్టుదలతో ముందుకెళితే విజయం సాధించోచ్చని ప్రధాని సూచించారు. అభివృద్ధితో పాటు వారసత్వాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలో గుజరాత్ చూపించిందని చెప్పారు. 2026లో తన మొదటి పర్యటన గుజరాత్ అని.. సోమనాథుడి దర్శించుకోవడంతో ఈ ఏడాది తన పర్యటన ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు పీఎం మోడీ. ప్రధానితో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్, డిప్యూటీ సీఎం హర్ష్ సంఘవి కూడా పాల్గొన్నారు.
గుజరాత్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ గుజరాత్ ఇండస్ట్రీయల్ కార్పొరేషన్ ద్వారా 7 జిల్లాల్లో 3540 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసి కొత్త స్మార్ట్ ఇండస్ట్రీయల్ ఎస్టేట్ లను కూడా ప్రారంభించారు. కాగా, వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు.. పశ్చిమ గుజరాత్ లో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో 1800లకు పైగా బిజినెస్ సమావేశాలు, 1500 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారని అంచనా వేస్తున్నారు.

Read Also: బంగారం, వెండిపై అధిక లాభాలు రావాలా.. ఇలా చేయండి..!
Follow Us On: Sharechat


