కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఆ మధ్య కొంచెం తగ్గినట్టు కనిపించినా.. మళ్లీ ఊపందుకున్నాయి. దీంతో బంగారం, వెండి మీద పెట్టుబడులు పెరుగుతున్నాయి. అయితే ఈ బంగారం, వెండి మీద ఎక్కువ లాభాలు రావాలంటే ఎక్స్ ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) బెటర్ ఆప్షన్ అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మనం సాధారణంగా బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బిస్కెట్లు.. వెండిని భౌతిక రూపంలో కొనుగోలు చేస్తాం. ఇంకొందరు డిజిటల్ గోల్డ్, వెండి కొంటారు. కానీ బంగారు, వెండి ఆభరణాలు కొంటే మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ చెల్లించాలి. తిరిగి అమ్మేటప్పుడు తరుగు తీసేస్తే మనకు అనుకున్నంత రేట్ రాదు.
నాణేలు, బిస్కెట్లు, వెండి ఆభరణాలు అయితే అమ్మేటప్పుడు చాలా సమస్యలు వస్తాయి. కానీ ETF లో కొనడం, నిల్వ చేయడం, అమ్మడం చాలా ఈజీ. ఈ పద్ధతిలో కొంటే తయరీ ఖర్చులు, తరుగు లాంటివి ఉండవు. పైగా అమ్మేటప్పుడు మనకు గోల్డ్ లేదా వెండి ఉన్న మొత్తానికి రేటు వచ్చేస్తుంది. ఇందులో గోల్డ్, వెండి 99.5 స్వచ్ఛత ఉంటుంది. కాబట్టి మనం స్వచ్ఛత విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనం కొనే గోల్డ్, వెండి ఈటీఎఫ్ లు ఎలక్ట్రానిక్ రూపంలో డీమ్యాట్ ఖాతాల్లో స్టోర్ అయి ఉంటాయి. దొంగతనం అవుతాయనే భయం ఉండదు. ఇందులో ఎవరైనా ఈజీగా పెట్టుబడులు పెట్టొచ్చు. రోజులో ఎప్పుడైనా ఈ గోల్డ్, వెండి యూనిట్లను అమ్ముకోవచ్చు. డిజిటల్ గోల్డ్ లేదా వెండికి ఆదరణ ఉన్నప్పటికీ.. అది సెబీ నియంత్రణలో లేదు. ఈటీఎఫ్ సెబీ నియంత్రణలోనే ఉంది కాబట్టి మన పెట్టుబడులకు రక్షణ ఉంటుందని ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు.
ఈటీఎఫ్ లో బంగారం, వెండి కొనడం ఎలా..?
దీని కోసం నమ్మదగిని బ్రోకరేజీ సంస్థ ద్వారా ముందు డీమ్యాట్ ఖాతా తెరవాలి. అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీలు అందించే గోల్డ్, వెండి ఈటీఎఫ్ యూనిట్లను కొనాలి. ఉదాహరణకు నిప్పన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ లాంటి వాటితో పాటు వెండి యూనిట్లు కూడా ఉంటాయి. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ ఒక గ్రాము బంగారంతో సమానం. అలాగే వెండి యూనిట్ గ్రాము వెండితో సమానంగా ఉంటుంది. మనం ఒక ఈటీఎఫ్ యూనిట్ నుంచే పెట్టుబడులు స్టార్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎంతైనా కొనొచ్చు. మనం డీ మ్యాట్ ఖాతాలో మనకు కావాల్సిన గోల్డ్ లేదా వెండి ఈటీఎఫ్ పేరును ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. షేర్ మార్కెట్ లో షేర్లను కొన్నట్టే ఈటీఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. షేర్లను అమ్మినట్టే ఈటీఎఫ్ యూనిట్లను అమ్మొచ్చు. ప్రస్తుత రోజుల్లో భౌతిక రూపంలో గోల్డ్, వెండి కొనడం కంటే ఈటీఎఫ్ లో కొనేందుకు పెట్టుబడిదారులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు సర్వేలు చెబుతున్నాయి.
Read Also: పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత.. మార్షల్ ఆర్ట్స్‌లో ప్రపంచ గుర్తింపు
Follow Us On: Sharechat


