సూపర్ 8లో టీమ్ ఇండియా షెడ్యూల్ ఫిక్స్

కలం, వెబ్ డెస్క్:  సూపర్ 8లో టీమ్ ఇండియా షెడ్యూల్ (India Super 8 Schedule) ఖరారైంది. ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌తో భారత్ తదుపరి దశ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. గ్రూప్ ఏలో అగ్రస్థానంతో సూపర్ 8కు చేరిన భారత్ ఇప్పుడు గ్రూప్ 1లో పోటీపడనుంది. పాకిస్థాన్‌పై 61 పరుగుల భారీ విజయం సాధించిన భారత్ మూడు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సంపాదించింది. +3.050 నెట్ రన్‌రేట్‌తో టాప్‌లో నిలిచింది. సీడింగ్ ప్రకారం గ్రూప్ 1లో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఎక్స్2 సీడింగ్ పొందినప్పటికీ టోర్నీ నుంచి తప్పుకోవడంతో జింబాబ్వే ఆ స్థానాన్ని దక్కించుకుంది.

సూపర్ 8లో భారత్ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 22న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతుంది. రెండో మ్యాచ్ ఫిబ్రవరి 26న చెన్నై ఎం.ఏ. చిదంబరం స్టేడియంలో జింబాబ్వేతో ఉంటుంది. మూడో, చివరి మ్యాచ్ మార్చి 1న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరుగుతుంది. మూడు మ్యాచ్‌లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. గ్రూప్ దశలో భారత్ మొదట అమెరికాపై 29 పరుగుల విజయం సాధించింది.

తరువాత నమీబియాను 93 పరుగుల తేడాతో ఓడించింది. పాకిస్థాన్‌పై 61 పరుగుల గెలుపుతో సూపర్ 8 స్థానం ఖరారు చేసింది. ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. సూపర్ 8లో రెండు గ్రూపుల నుంచి తొలి రెండు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీఫైనల్స్ మార్చి 4, 5 తేదీల్లో జరుగుతాయి. ఫైనల్ మార్చి 8న నిర్వహించనున్నారు. ఇప్పుడు భారత్ దృష్టి పూర్తిగా సూపర్ 8 పోరుపైనే ఉంది. తదుపరి దశలో ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనుంది.

Read Also: వరుణుడి దెబ్బకు ఆస్ట్రేలియా ఔట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>