epaper
Wednesday, February 18, 2026
epaper

స్వరాష్ట్రంలో జర్నలిస్టులకు అన్యాయం

కలం, నిజామాబాద్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్‌జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న, మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ (Empanelment) చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం ఆయా పత్రికల జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని  సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కార్యాలయం (సమాచార భవన్) ఎదుట ఆందోళన చేపట్టారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) ఇచ్చిన “ఛలో సమాచార భవన్” పిలుపు మేరకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిన్న, మధ్య తరహా పత్రికల నిర్వహకులు, పాత్రికేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా వెళ్లిన జర్నలిస్టులు దాదాపు రెండు గంటల పాటు కార్యాలయం ప్రవేశ ద్వారం ఎదుట బైఠాయించి ధర్నా చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య (Mamidi Somaiya) మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వరాష్ట్రంలో చిన్న, మధ్య తరహా పత్రికల అణచివేత కొనసాగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 44 వేలకు పైగా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, కేవలం ఎంప్యానల్‌మెంట్ అయిన కొన్ని పత్రికలకు, చానళ్ళకు మాత్రమే ఇస్తూ మిగతా పత్రికలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంప్యానల్‌మెంట్‌తో సంబంధం లేకుండా ఆర్ఎన్ఐ గుర్తింపు ఉన్న అన్ని పత్రికలకు ఆయా పత్రికల సర్క్యులేషన్ ఆధారంగా జర్నలిస్టులందరికి అక్రెడిటేషన్ కార్డులిచ్చే వారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ పద్దతిని తుంగలో తొక్కి పత్రికలకు ఎంప్యానల్ ముసుగు తొడిగి, నిబంధనల పేరుతో చిన్న, మధ్య తరహా పత్రికలను పాతాళానికి తొక్కారని మామిడి సోమయ్య (Mamidi Somaiya) ధ్వజమెత్తారు. తెలంగాణ స్వరాష్ట్రంలోనే చిన్న మధ్య తరహా పత్రికలకు, వాటిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు తీరని అన్యాయం జరిగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: సూపర్ 8లో టీమ్ ఇండియా షెడ్యూల్ ఫిక్స్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>