Mobile Popup Ad
Mobile Popup Ad

గంజాయితో తండాయి మిల్క్.. HYD సర్కిళ్లలో అమ్ముతున్న వ్యక్తి

కలం, డెస్క్ : హైదరాబాద్ లో మరో షాకింగ్ విషయం బయటకొచ్చింది. గంజాయి కలిపిన పాలను తండాయి (Ganja Milk) పేరుతో అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ బేగంబజార్ లో గంజాయి కలిపిన పాలను తండాయి అంటూ అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు పాలల్లో గంజాయి, డ్రైఫ్రూట్స్, ఐస్ కలిపి అమ్మేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. కేవలం బేగం బజార్ లోనే కాకుండా సిటీలోని బిజీ సర్కిళ్లలో వీటిని అమ్ముతున్నట్టు పోలీసులు చెప్పారు.

పాలల్లో గంజాయి చాక్లెట్లు కలిపేసి.. రూ.150కి తండాయిని (Ganja Milk) వికాస్ అమ్ముతున్నాడు. మామూలుగా అయితే తండాయి రూ.50కి అమ్ముతుంటారు. కానీ గంజాయి కలిపడం వల్ల దీన్ని అంత రేటుకు అమ్ముతున్నాడు వికాస్. నిందితుడి ఇంట్లో 1920 గంజాయి చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన చాక్లెట్లలో 9.6 కిలోల గంజాయి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హోలీ పండుగ కోసం గంజాయి చాక్లెట్లను ఆగ్రా నుంచి పెద్ద ఎత్తున వికాస్ శర్మ తెప్పించాడని పోలీసులు చెబుతున్నారు. నిందితుడికి గంజాయి చాక్లెట్లు ఎలా వచ్చాయి.. అతని వెనకాల ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.

Read Also: జాతీయ రహదారుల వెంట ‘తేనెటీగ’ల కారిడార్లు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>